రవాణా శాఖ కమిషనర్ గా రఘునందన్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : రవాణా శాఖ కమిషనర్‍గా సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం.రఘునందన్ (M.Raghunandan) ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఖైరతాబాద్‍లోని (Khairatabad) రాష్ట్ర రవాణా శాఖ కార్యాలయంలోని తన ఛాంబర్‍లో ఆయన బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా జేటీసీ రమేష్ కొత్త కమిషనర్‍కు స్వాగతం పలికారు. ఇంతవరకు వ్యవసాయ, సహకార శాఖలతో పాటు ప్రభుత్వ కార్యదర్శిగా ఉన్న ఎం.రఘునందన్ రావును వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‍గా నియమించింది. అలాగే ఆయనకు రవాణా శాఖ కమిషనర్‍గా (Transport Department Commissioner) అదనపు బాధ్యతలను అప్పగించింది. ఆయన స్థానంలో కే.సురేంద్ర మోహన్‍ను వ్యవసాయ, సహకార శాఖల కార్యదర్శితో పాటు ప్రభుత్వ కార్యదర్శిగా నియమించింది.

