Badminton star | యుద్ధ ఉద్రిక్తతల మధ్య….

Badminton star | యుద్ధ ఉద్రిక్తతల మధ్య….

Badminton star | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు భార‌త్ కు చేరుకున్నారు. యుద్ధం కార‌ణంగా దుబాయ్ లో చిక్కుకున్న పీవీ సింధు ఎట్ట‌కేల‌కు భార‌త్ కు చేరుకున్నారు. తెల్ల‌వారుజామున బెంగ‌ళూరుకు చేరుకున్నారు.

మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతల మధ్య వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన నేపథ్యంలో, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కూడా దుబాయ్‌లో ఇరుక్కుపోయారు. దుబాయ్ ఎయిర్‌పోర్ట్ మూతపడటం, ఫ్లైట్ రద్దు, ఎయిర్‌స్పేస్ మూసివేతలతో ఆమె ప్రయాణం అత్యంత కష్టతరమైంది.

అయితే, ఎట్టకేలకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సింధు భారత్ చేరుకున్నారు. తెల్లవారుజామున బెంగళూరు విమానాశ్రయానికి సురక్షితంగా దిగారు. ఈ ఘటన యుద్ధ ఉద్రిక్తతల మధ్య అంతర్జాతీయ ప్రయాణాలు ఎంత ప్రమాదకరమో మరోసారి రుజువు చేసింది.
ప్రయాణికులు ఇప్పుడు భారీగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సింధు భారత్ చేరుకోవడం వారికి కొంత ఊరటనిచ్చినట్లు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply