పుట్టపర్తి నారాయణచార్యుల జయంతి వేడుకలు

పుట్టపర్తి నారాయణచార్యుల జయంతి వేడుకలు
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ప్రముఖ పండితుడు, సాహిత్యవేత్త పుట్టపర్తి నారాయణచార్యులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి పాల్గొని, నారాయణచార్యులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పుట్టపర్తి నారాయణచార్యులు తెలుగు సాహిత్యానికి అందించిన సేవలు, వారి విశిష్ట పాండిత్యం, సమాజానికి అందించిన మార్గదర్శకత్వం ఎంతో గొప్పదని తెలిపారు.
వారి ఆలోచనలు యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు .తెలుగు సాహిత్యానికి, ప్రాచీన అధ్యయనాలకు ఆయన చేసిన అపారమైన సేవలకు గౌరవ సూచకంగా ప్రతి సంవత్సరం మార్చి 28న ఆయన జయంతిని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె.వి. రమణ, డీఎస్పీ శేషాద్రి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని పుట్టపర్తి నారాయణచార్యులు కి నివాళులు అర్పించారు.
…….
