కూకట్‌పల్లి, (ఆంధ్రప్రభ): కూకట్‌పల్లి కెపిహెచ్‌బీ కాలనీలో ముకుందా జ్యూవెలర్స్ ఆధ్వర్యంలో ‘పూర్వీ గోల్డ్, డైమండ్ అండ్ సిల్వర్’ నూతన షోరూమ్ శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా స్థానిక కార్పొరేటర్ పగడాల శిరీష హాజరై షోరూమ్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముకుందా జ్యూవెలర్స్ సీఈఓ, డైరెక్టర్ నికితా రెడ్డి మాట్లాడుతూ, బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని 18 కారెట్ల బంగారు ఆభరణాలను తక్కువ ధరల్లో అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. పూర్వీ గోల్డ్ షోరూమ్ ద్వారా వినియోగదారులు అత్యుత్తమ నాణ్యతతో కూడిన బంగారం, వజ్రాభరణాలు, వెండి వస్తువులను సులభంగా పొందగలరని చెప్పారు.
అలాగే సంస్థ డైరెక్టర్ కృష్ణ మాట్లాడుతూ, షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా నవంబర్ 9వ తేదీ వరకు రూ.3 లక్షల విలువైన ఆభరణాలు కొనుగోలు చేసే వారికి బంగారు నాణెం ఉచిత బహుమతిగా అందజేస్తామని తెలిపారు. అదనంగా, ఈ నెల 3వ తేదీ లోపు తమ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ను ఫాలో అయ్యే మొదటి వెయ్యి మందికి ఉచితంగా వెండి నాణెం అందజేస్తామని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో జ్యూవెలరీ రంగానికి చెందిన పలువురు వ్యాపారవేత్తలు, వినియోగదారులు పాల్గొన్నారు.

