Purchase center | కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం…

Purchase center | కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం…
Purchase center | కోడుమూరు, ఆంధ్రప్రభ : కోడుమూరు నియోజకవర్గంలోని పాలకుర్తి గ్రామంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, డీసీఎంఎస్ చైర్మన్ వై. నాగేశ్వర్ రావు యాదవ్ ప్రారంభించారు. ఎన్సీసీఎఫ్, మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో డీసీఎంఎస్ ద్వారా ఈ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా డీసీఎంఎస్ చైర్మన్ వై. నాగేశ్వర్ రావు యాదవ్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తోందని తెలిపారు. కేంద్ర ఏజెన్సీ ఎన్సీసీఎఫ్, మార్క్ఫెడ్ ద్వారా డీసీఎంఎస్ కేంద్రాల ద్వారా కందులకు క్వింటాలుకు రూ.8,000 గిట్టుబాటు ధర కల్పిస్తున్నట్లు వెల్లడించారు. కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ డి. విష్ణువర్ధన్ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని తమ పంటను విక్రయించాలని కోరారు.

కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ డి. విష్ణువర్ధన్ రెడ్డి సహకారంతో రైతుల కోసం ప్రారంభించిన ఈ కందుల కొనుగోలు కేంద్రంలో నాణ్యమైన పంటను రైతులు విక్రయించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు న్యాయమైన ధర లభిస్తుందని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో వై. రాఘవేంద్ర యాదవ్, ఉగాది వెంకటేశ్వర యాదవ్, ఉగాది సీతారాం యాదవ్, మాన్వి విజయ్ కుమార్ యాదవ్, లారీ విజయ్ యాదవ్, యూసఫ్, మల్లికార్జున యాదవ్, కోడుమూరు మండల టీడీపీ కన్వీనర్ రామకృష్ణారెడ్డి, కోడుమూరు పట్టణ కన్వీనర్ గంగాధర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
