Public service | ఆత్మీయంగా ఆదరించండి అభివృద్ధిని ఆస్వాదించండి

Public service | ఆత్మీయంగా ఆదరించండి అభివృద్ధిని ఆస్వాదించండి

Public service | ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : మండల పరిధిలో రాఘవాపురం గ్రామపంచాయతీలోని గ్రామాల ప్రజలు ఆత్మీయంగా ఆదరించండి అభివృద్ధి ఆస్వాదించండని, కాంగ్రెస్ ఆధ్వర్యంలో అభివృద్ధికి బాటలు వేస్తామని కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పాయం రామనర్సయ్య అన్నారు. ఎన్నోనిర్బంధాలు ఎదుర్కొని, రాజకీయం(politics)లో ఎన్నో మలుపులు, గెలుపులు, ఓటమిలను చవిచూస్తూ అలుపెరగక సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీ ముందుకు వస్తున్నానని మెండుగా నిండుగా ఆశీర్వదించమని, ఆదరించమని అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తాన‌న్నారు.

చంద్రాపురం, సీతానగరం, రాఘవాపురం, బండారిగూడెం, కర్ణగూడెం గ్రామాల ప్రజలకు బాల్ గుర్తుపై మీఅమూల్యమైన ఓటును వేయాలని వాడవాడనా ఓటర్లతో మమేకమై చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తూ, ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. పదవి ముఖ్యంకాదు ప్రజాసేవే(Public service) నాలక్ష్యం, ప్రజల కష్టసుఖాలను తెలిసిన వాడిగా, ఆదర్శరైతుగా పాలుపంచుకోవాలని ప్రజల కోరిక మేరకు, రాఘవాపురం కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా వస్తున్నానని ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేశానని, మిమ్ముల కంటికి రెప్పలా కాపాడుకుంటానని, ప్రజలకు అందుబాటులోఉంటూ పనిచేస్తానని, రాఘవాపురాన్ని ఆదర్శవంతం(exemplary)గా తీర్చిదిద్దుతానని ప్రచారంలో దూసుకుపోయారు.

ప్రత్యర్థులపై ఎత్తుకుపైఎత్తు ప్రచారంలో ముందుకు సాగారు. డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరిస్తానని, మరమ్మత్తు చేయించి అభివృద్ధి(development) చేస్తానని,మహిళల, యువత అభివృద్ధికి అంకితభావంతో కృషిచేస్తానని ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తానని, అభివృద్ధిలో భాగస్వామ్యమౌతూ చేదోడువాదోడుగా పనిచేస్తూ నాగుర్తు పుట్ బాల్ గుర్తుపై ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

Leave a Reply