Honor | సేవలకు ప్రజల ఆదరణ గొప్ప

Honor | సేవలకు ప్రజల ఆదరణ గొప్ప
- రాష్ట్ర కమిషనర్ పోచయ్య
Honor | జన్నారంరూరల్, ఆంధ్రప్రభ : ఉద్యోగరీత్యా సేవలందించినందుకు ప్రజల ఆదరణ పొందడం ఎంతో గొప్పని హైదరాబాద్ ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ పోచయ్య అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో హెచ్ఎంగా పనిచేసి పదవీ విరమణ పొందిన నాసాని రమేష్ చందర్, దంపతులను ఆదివారం సాయంత్రం శాలువ కప్పి, మెమొంట్ అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రమేష్ చందర్ తన ఉద్యోగరీత్యా మచ్చలేని వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారన్నారు. విద్యార్థుల, తల్లిదండ్రుల, తోటి సహ ఉద్యోగులతో ఎంతో సున్నితంగా ఉండి, విధి నిర్వహణ చక్కగా నిర్వర్తించారని ఆయన తెలిపారు. అందుకే ఆయన సన్మాన సభకు ఇంతమంది రావడం సంతోషమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రమణమూర్తి, ఎంఈఓ విజయ్ కుమార్, పలు పాఠశాల హెచ్ఎంలు, తదితరులు పాల్గొన్నారు.
