provided | దండేపల్లి, ఆంధ్రప్రభ : ప్రతి విద్యార్థి సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలని వెరబెల్లి ఫౌండేషన్ అధ్యక్షులు రఘునాథరావు పేర్కొన్నారు. దండేపల్లి మండలం వెల్గనూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆయన ఇవాళ ఐదు లాప్టాప్ లు, టీవీ అందజేశారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… పాఠశాలలో విద్యార్థులు కష్టపడి చదువుకొని ముందుకు రావాలని సూచించారు. నేటి సాంకేతిక యుగంలో ప్రతి విద్యార్థి సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటేనే భవిష్యత్తులో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు.. అనంతరం సర్పంచ్ గా ఎన్నికైన మానస తులసి, రఘునాథరావు ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి, బీజేపీ నాయకులు బందెల రవి గౌడ్, గోపతి రాజయ్య, సురేష్, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

