ముదిరిన ప్రొటోకాల్‌ వివాదం

ముదిరిన ప్రొటోకాల్‌ వివాదం

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్‌: రాష్ట్రపతి ప్రొటోకాల్‌ పాటించకపోవడంపై కేంద్రం, పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై ప్రధాని మోడీ టీఎంసీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ముర్ము బెంగాల్‌కు వెళ్తే సత్కరించడానికి బదులు..ఆమె పాల్గొనే కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఎంతో కష్టపడి దేశంలోని అత్యున్నత స్థానానికి ఎదిగారని ప్రధాని తెలిపారు. ముఖ్యమంత్రి మమత రాష్ట్రపతిని, అత్యునత భారత రాజ్యాంగాన్ని కూడా అవమానించిందని ఆరోపించారు. ఇలాంటి నీచపు రాజకీయాలు చేసే తృణమూల్‌ పార్టీకి బెంగాల్ ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారన్నారని ప్రధాని మెడీ పేర్కొన్నారు.


రాష్ట్రపతి ప్రొటోకాల్‌ ఘటనపై స్పదించారు. రాష్ట్రపతి కార్యక్రమంలో ఎలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేశారు. కాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయలేదని ఆమె తెలిపారు. ప్రైవేట్ నిర్వాహకులు, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో చెత్త సమస్య, గ్రీన్ రూమ్ లోపాలు, మహిళల కోసం సరైన టాయిలెట్లు లేకపోవడం వంటి సమస్యలు ఉంటే వాటికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించదని సీఎం మమత స్పష్టం చేశారు.


అలాగే రాష్ట్రపతి, రాజ్యాంగం అంటే తనకు గౌవరం ఉందని వెల్లడించింది. రాష్ట్రపతి, రాజ్యాంగాని అవమానించే సంస్కృతి బీజేపీకి ఉందని ఒక ఫోటోను చూపిస్తూ ఆరోపించారు. ఆ ఫోటోలో ప్రధాని నరేంద్ర మోదీ కూర్చుని ఉండగా రాష్ట్రపతి నిలబడి ఉన్నారని ఆమె పేర్కొన్నారు. తాము ఎప్పుడూ రాజ్యాంగాన్ని తల్లిగా భావిస్తామన్నారు. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె దుయబట్టారు.

Leave a Reply