Protest rally | సిట్ నోటీసుల‌పై నిర‌స‌న ర్యాలీ….

Protest rally | సిట్ నోటీసుల‌పై నిర‌స‌న ర్యాలీ….

Protest rally | మక్తల్, ఆంధ్రప్రభ : ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీ ఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు సీట్ నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఈ రోజు కేసీఆర్ కు నోటీసులు అందజేయడాన్ని నిరసిస్తూ నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు నల్లజెండాలు ధరించి నిరసన ర్యాలీ చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం నివాసం నుండి నారాయణపేట క్రాస్ రోడ్డు వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. చావు అంచులకు వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాగించినందుకు కేసిఆర్ కు సిట్ నోటిసులు ఇస్తున్నారా? తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దినందుకు ఇస్తున్నారా సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన్నందుకు కేసిఆర్ కు సిట్ నోటీసులు అందించారా? అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటుకు ఓటు కేసులో జైలుకు వెళ్లి వచ్చిన నిందితుడని అలాంటి వ్యక్తి అవినీతి మచ్చలేని వ్యక్తి కేసీఆర్ కు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రతీకార చర్యలో భాగంగా సిట్ నోటీసులు జారీ చేయడం సిగ్గుచేటని ఆయన ధ్వజమెత్తారు.

ప్రభుత్వ వైఫేలాలను ఎండగట్టినందుకు మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినందుకు కెటిఆర్ కు, మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ కు సీట్ నోటీసులు ఇచ్చిందని అన్నారు. ఇలాంటి నౌటీసులకు భయపడే నైజం బీఆర్ఎస్ నాయకులకు లేదని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేడు ఫోన్ ట్యాపింగ్ చేయటం లేదా అని ఆయన ప్రశ్నించారు.

అక్రమ కేసులతో అణచివేయాలని చూస్తే ఈ రాష్ట్రం అగ్ని గుండం అవుతుందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం హెచ్చరించారు. సిట్ నోటీసులకు సరైన సమాధానం చెప్తామని స్వచ్ఛంగా అధినేత బయటికి వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మక్తల్ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పి. నరసింహ గౌడ్, బీఆర్ ఎస్ సీనియర్ నాయకులు కొత్త శ్రీనివాస్ గుప్తా, మక్తల్ పట్టణ అధ్యక్షుడు చిన్న హన్మంతు, నాయకులు కొత్త కాపు గోవర్ధన్ రెడ్డి, జుట్ల శంకర్, చందాపూర్ అశోక్ గౌడ్, జె. సాగర్, ఈశ్వర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply