ఆలేరులో రజకుల నిరసన…

ఆలేరు, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూలు జిల్లాలో రజక కుటుంబం పై అమానుషంగా జరిగిన దాడిలో పసికందు బలైన సంఘటన నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తహసీల్దార్ కార్యాలయం ముందు రజక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. దోషులను కఠినంగా శిక్షించాలని తహసీల్దార్ వలిగొండ ఆంజనేయులుకు వినతి పత్రం అందజేశారు. రజక సంఘం అధ్యక్షులు వడ్డెమాన్ నరేందర్, ప్రధాన కార్యదర్శి ఆలేటి అజయ్ కుమార్, ముదిగొండ శ్రీకాంత్, ఆలేటి అనిల్, ఆలేటి పాండు, ఆలేటి యాకన్న, వడ్డేమాన్ రవి, ఆలేటి సంతోష్, ఆలేటి బాలకిషన్, ఆలేటి నరసింహ, మల్లేష్, అశోక్, ఎలేందర్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.
