Protest |కిష‌న్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్య‌లు – బీజేపీ శ్రేణుల ఆగ్ర‌హం

బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాలి
అంబ‌ర్‌పేట తిల‌క్‌న‌గ‌ర్ చౌర‌స్తాలో ఆందోళ‌న‌
అంజ‌న్ కుమార్ యాదవ్ దిష్టిబొమ్మ ద‌హ‌నం

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపైబీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్ర‌వారం అంబర్‌పేట తిలక్ నగర్ చౌరస్తాలో బీజేపీ శ్రేణులు ఆందోళ‌న‌కు దిగారు. ఆయన దిష్టిబొమ్మను ద‌హ‌నం చేశారు. గురువారం కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన ఓ నిరసన కార్యక్రమంలో అంజన్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించార‌ని సంగ‌తి విదిత‌మే. దీనికి నిరసనగా బీజేపీ అంబర్‌పేట నియోజకవర్గం నాయ‌కుల ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఆ మాటలను ఉపసంహరించుకోవాలి
ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. అంజన్ కుమార్ యాదవ్ వెంటనే తాను మాట్లాడిన అసభ్య పదజాలలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ మాటలను ఉపసంహరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జి. ఆనంద్ గౌడ్, కార్పొరేటర్ వై. అమృత, నందకిషోర్ యాదవ్, వినోద్ యాదవ్, శ్యామ్ రాజు, మధు యాదవ్, యశ్వంత్, ఎంబీ కిషోర్, ప్రశాంత్ జోషి, వనం రమేష్, బల్వీర్, మైలారం రాజు, నాగభూషణ చారి, జ్యోతి, లక్ష్మణ్, సురేష్ యాదవ్, ప్రవీణ్, భాస్కర్ యాదవ్, క్షీర్ సాగర్, అరవింద్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply