వేధిస్తున్నారని నిరసన..

జన్నారంరూరల్, ఆంధ్రప్రభ : గొర్రెలు, మేకల కాపర్లైన యాదవులను అటవీశాఖ అధికారులు వేధిస్తూ, దుర్భాషలాడుతున్నారని యాదవ నేతలు ఈ రోజు మంచిర్యాల జిల్లా జన్నారం ఎఫ్డీఓ కార్యాలయం(FDO Office) ఎదుట నిరసన వ్యక్తం చేసి, ఆ తర్వాత ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు.

ఇటీవల మండలంలోని అక్కపెల్లిగూడ(Akkapeliguda)కు చెందిన ఉడుతల సత్తన్న జువ్విగూడలోని తన చేనులో ఆకు కోయడానికి వెళ్తుండగా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్(Forest Beat Officer) అడ్డుకొని నానా బూతులు తిట్టి, ద్విచక్ర వాహనాన్ని తీసుకెళ్లిందని, ఆ వాహనం ఇప్పించి, న్యాయం చేయాలని, అడవుల్లోకి వెళుతున్న గొర్రెల, మేకల కాపరులైన యాదవులపై అటవీ శాఖ అధికారుల వేధింపులాపాలని యాదవులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో యాదవ నేతలు సంధ్యవేని పవన్, పెంకర్ల రాయమల్లు, డి.శ్రీనివాస్, పి.నరేష్, జి.మహేష్, జి. లక్ష్మణ్, ఎం.సాగర్, జి. తిరుపతి, కొమురయ్య, ఐలయ్య, జక్కుల తిరుపతి, ఉడుతల రాహుల్ గంగన్న, రవి, మహేష్ మల్లేష్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply