Protest | ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌లేద‌ని నిర‌స‌న‌..

Protest | నర్సంపేట, ఆంధ్రప్రభ : అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించిన కళ్యాణ లక్ష్మి పథకంలో తులం బంగర మేదని బీఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు వాసం కరుణ ప్రశ్నించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలని నర్సంపేట పట్టణ బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి అయినా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తా అన్న హామీలను నెరవేర్చలేదన్నారు.

వంద రోజులలోనే 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేస్తామని మోసం చేశార‌ని వాసం కరుణ ఆరోపించారు. పెళ్లి చేసుకున్న ప్రతి మహిళకు కళ్యాణ లక్ష్మి పథకం కింద కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న రూ.లక్ష 16తో పాటు తులం బంగారం ఏమైందని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఒక్క మహిళకు కూడా బంగారం ఇవ్వలేదని తెలిపారు. ఎన్నికలకు ముందు ప్రతి మహిళకు ప్రతినెల 2500 అకౌంట్ లో వేస్తామని హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అయినా ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు.

వితంతువులకు, ఒంటరి మహిళలకు ఇస్తాన‌న్న‌ పెన్షన్ 4 వేలు ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. చదువుకుంటున్న విద్యార్థినిలకు స్కూటీలు ఇవ్వలేదనీ, విద్యా భరోసా కార్డు కింద చదువుకునే విద్యార్థినిలకు ఐదు లక్షలు ఇవ్వలేదనీ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిటీ బాధ్యులు నాయిని సునీత, చింతం విజయరాణి, బొచ్చు సరళ వడ్లుకొండ స్వరూపా, పలువురు మహిళ నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply