protest | రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం

protest | రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం
- రెడ్ బుక్ పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం
- అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ నాయకుల నిరసన
protest | బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బాపట్ల వైసీపీ నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. శనివారం వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాపట్ల వైసీపీ సమన్వయకర్త కోన రఘుపతి దిశా నిర్దేశంతో బాపట్ల జిల్లా ఎస్సీ సెల్, మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్త మందా సాల్మన్ మృతి పట్ల బాపట్ల అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా బాపట్ల వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షుడు కాగిత సుధీర్ బాబు మాట్లాడుతూ.. పిన్నెల్లి గ్రామంలో మందా సాల్మన్ హత్యపై చంద్రబాబును తీవ్రంగా ప్రశ్నించారు. రాజకీయ హింస వలసలు పోలీసులతో పాటు రాష్ట్రంలో భయాన్ని పెంచాయని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికి వదిలేసి రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంటారని కాగిత సుధీర్ బాబు సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో జరిగిన వైసీపీ దళిత కార్యకర్త మందా సాల్మన్ హత్య ఘటనపై ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఉన్న భార్యను పరామర్శించడానికి సంతూర్ కి వచ్చిన ఒక పేదవాడిని ఇనుపరాడ్లతో దారుణంగా కొట్టి చంపడం అమానుషమని ఆవేదన వల్లబుచ్చారు.
పైగా బాధితుడు పైన తప్పుడు కేసులు బనాయించడం కూటమి ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మంది పడ్డారు. పౌరుల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన సీఎం స్వయంగా కక్ష సాధింపు చర్యలను ప్రోత్సహిస్తూ హంతకులకు వెన్నుదన్నుగా నిలవడం దుర్మార్గమని అసలు పాలించడానికి చంద్రబాబు అనర్హులేనా అని నిలదీశారు. వైయస్సార్సీపి ఎస్సి, బిసి మైనార్టీ సెల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
