protest | వక్ఫ్ బోర్డు రాష్ట్ర కార్యాలయం వద్ద మైనార్టీ నేతలతో నిరసన

protest | వక్ఫ్ బోర్డు రాష్ట్ర కార్యాలయం వద్ద మైనార్టీ నేతలతో నిరసన

protest |విజయవాడ, ఆంధ్రప్రభ: వక్ఫ్ బోర్డు స్థలాలు ఆస్తులు మైనార్టీలకి చెందే విధంగా భారత రాజ్యాంగం కల్పించిన చట్టాలని రాష్ట్రంలోని కుటమి ప్రభుత్వం అమలు చేయకుండా తొంగలో తొక్కడం ఎంతవరకు సమంజసం అని ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం విజయవాడలో వక్ఫ్ బోర్డు రాష్ట్ర కార్యాలయం ఎదుట గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా తో కలిసి ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అంజుమన్ ఆస్తులను, కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలంతా పోరాడుతుంటే ఓటమి ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదన్నారు. రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీ లందరూ చేస్తున్న పోరాటం మైనార్టీ ఆస్తుల కోసం కాదని, మైనార్టీల ఆత్మగౌరవం మరియు మైనార్టీల యొక్క భవిష్యత్తు తరాల కోసం చేస్తున్న పోరాటమని స్పష్టం చేశారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ద్వారా చేస్తున్న అక్రమాలను, అన్యాయాలను మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు వెల్లడించారు. ఇప్పటికే మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కార్యాలయాల వద్ద వైసిపి మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో కలెక్టర్లకి వినతి పత్రాలు ఇచ్చి శాంతియుతంగా తమ నిరసన తెలియజేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి గుంటూరు జిల్లా అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా, విజయవాడ వైసిపి కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ అలీమ్, వైసీపీ మైనార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply