Protection | ప్రజల రక్షణ కోసం 24×7 పనిచేస్తాం

Protection | ప్రజల రక్షణ కోసం 24×7 పనిచేస్తాం

  • ప్రజా భద్రతే…పోలీసుల లక్ష్యం
  • శిక్షణ తరగతులతో పని తీరు మెరుగుపడుతుంది
  • వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

Protection | వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : సమాజ రక్షణకై 24×7 పనిచేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ గుర్తు చేశారు. పోలీసులు ప్రజా సేవకులని మరువకుండ మరింత బాధ్యతగా పని చేయాలన్నారు.శిక్షణ తరగతులతో పోలీసులు మరింత సమర్ధవంతులుగా తయారవుతారని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. వరంగల్ పోలీస్‌ కమిషనరేట్‌ ఆర్మూడ్‌ రిజర్వ్‌ పోలీసులకు పదిహేను రోజుల పాటు నిర్వహించిన పున:శ్చరణ శిక్షణ తరగతులు శనివారం ముగిసాయి.

ఈ ముగింపు కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ముఖ్య అతిధిగా పాల్గోని సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ సిబ్బంది నిర్వహించిన పోలీస్ పరేడ్ ను తిలకించారు. అనంతరం పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ నిరంతరం సాధన చేయడం ద్వారా విధుల్లో మరింత రాణించగలమన్నారు. పున:శ్చరణ శిక్షణ తరగతుల ద్వారా నేర్చుకున్నా అంశాలపై సిబ్బంది పట్టు సాధించాలన్నారు.

Protection |

ఈ శిక్షణలో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి రివార్థులను అందజేయడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ డీసీపీ దార కవిత, అదనపు డీసీపీలు రవి, సురేష్ కుమార్, శ్రీనివాస్, ట్రైనీ ఐ. పీ. ఎస్ మనీషా నెహ్ర, ఏసీపీలు డాక్టర్ మూల జితేందర్ రెడ్డి, నాగయ్య, సురేంద్ర, అంతయ్య, ఆర్. ఐ లు సతీష్, చంద్రశేఖర్, శ్రీధర్ లతో పాటు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Protection |
Protection |

CLICK HERE TO READ MORE : Maoist | అచ్చంపేటలో కీలక మావోయిస్టుల అరెస్ట్

CLICK HERE TO READ MORE :

Leave a Reply