protect |అడవులను వన్యప్రాణాలను రక్షించాలి

protect |అడవులను వన్యప్రాణాలను రక్షించాలి

ప్రజలకు అవగాహన కల్పిస్తున్న డిప్యూటీ రేంజ్ అధికారి జ్ఞానేశ్వర్

protect | జైనూర్,ఆంధ్రప్రభః అడవులను వన్యప్రాణాలను రక్షించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని దబోలి సెక్షన్ డిప్యూటీ రేంజ్ అధికారి జ్ఞానేశ్వర్ కోరారు. కెరమేరి అటవీ క్షేత్ర అధికారి యోగేష్ కులకర్ణి ఆ దేశాల మేరకు ఆయన కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని ధబోలి గ్రామంలో దభోలి డిప్యూటీ రేంజ్ అధికారి జ్ఞానేశ్వర్ గస్తీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో సందర్శించి అటవీసంరక్షణ, వన్యప్రాణి సంరక్షణ పై ప్రజలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవి జంతువులను చంపడానికి అక్రమ విద్యుత్ తీగలు వేయకూడదని అడవులను రక్షించకుండా నరికితే అలాంటి వారిపై శాఖా పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

ఎవరినైనా అటవీ చట్టాలను ఉల్లంగిస్తే… ఎంతటి వారినైనా ఉపేక్షించేదిలేదని.. కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అటవీ చట్టాలు అడవుల రక్షణ అడవి జంతువుల రక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు. ఎవరైనా చట్టాలను ఉల్లంఘించిన అక్రమాలకు పాల్పడ్డ జైలుకు పంపిస్తామని ఆయన పేర్కొన్నారు .ఈ అవగాహన కార్యక్రమంలో అటవీ బీట్ అధికారి దేవిదాస్, రాష్ట్ర మానవ హక్కుల కమిటీ ప్రధాన కార్యదర్శి గిరే సుధామ్, నాయకులు అశోక్ ,మారుతి, ఆనందరావు, భగవాన్, జ్ఞానేశ్వర్, హరిదాస్, రాము, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply