Promotion | ఆశతో కాదు.. ఆశయంతో వస్తున్నా..

Promotion | ఆశతో కాదు.. ఆశయంతో వస్తున్నా..

  • అభివృద్ధిని చేతలతో చేసి చూపిస్తా
  • గ్రామ సర్పంచ్ అభ్యర్థిని అడిగొప్పుల (చింత) వినీల ప్రదీప్

Promotion | కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ : నీతి నిజాయితీగా.. ధర్మబద్ధంగా గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని, ఓట‌ర్ల‌కు త‌న‌కు ఒక్కసారి అవకాశం ఇచ్చి సర్పంచ్‌గా భారీ మెజారిటీతో గెలిపించాలని అడిగొప్పుల ( చింత ) వినీల ప్రదీప్ కోరారు. ఈ సంద‌ర్భంగా ఆమె ఆంధ్ర‌ప్ర‌భ‌తో మాట్లాడుతూ… కమ్మర్ పల్లి గ్రామాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుతానన్నారు.

భర్త చాటు భార్యగా కాకుండా, స్వతంత్ర మహిళగా పరిపాలన అందిస్తానన్నారు. మీ ఆడబిడ్డగా మీ ముందుకు వచ్చానని, ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు వేసి తనను గెలిపించాలని, మీ ఓటు విలువ గ్రామ అభివృద్ధికి(development) వజ్రాయుధమన్నారు. నిరంతరం గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ మీ సేవకురాలిగా పని చేస్తానన్నారు. అవినీతి, మధ్య వర్తిత్వం లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఉజ్వల గ్రామ స్వరాజ్యం స్థాపించి చూపిస్తాననన్నారు.

రైతుల(farmers)కు, పేదలకు అండగా నిలుస్తానని చెప్పారు. ఇంటింటి ప్రచారం(Promotion)లో ప్రజలంతా అడుగడుగునా వినీల ప్రదీప్ కు బ్రహ్మరథం పడుతున్నారు. సామాజిక న్యాయం జరగాలంటే వినీల అక్కను గెలిపించి తీరాలని ప్రజలంతా బలంగా నమ్ముతున్నారు. ప్రజలు మెచ్చేల, విశ్వసించేలా పాలకురాలుగా కాకుండా ప్రజా సేవకురాలిగా పని చేస్తానని వినీల ప్రదీప్ ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply