వినూత్న రీతిలో ప్రచారం..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కేంద్రంలోని నాలుగో వార్డ్ లో బిజెపి పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తేరాల మంజుల ఆదివారం వినూత్న రీతిలో తన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా బీడీ కార్మికులను కలిసి బీడీలను చూడుతూ తనను కౌన్సిలర్ అభ్యర్థిగా ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. పలువురు మహిళా నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు.
