Project | ప్రాజెక్టు పూర్తి చేయించే బాధ్యత ముఖ్య మంత్రిది

Project | ప్రాజెక్టు పూర్తి చేయించే బాధ్యత ముఖ్య మంత్రిది
- నీటి ప్రాజెక్టులను సందర్శించాలి
- నీటి కోసం మరో ఉద్యమం
- పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ఇప్పటికీ చేపట్టలే
- నీటి హక్కుల కోసం అందరం కలిసి పోరాడుదాం
- టిఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి
Project | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : రెండు సంవత్సరాలైనా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు(project) పూర్తి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి ఈ జిల్లా వాసి అయిన రేవంత్ రెడ్డి పై ఉందని టీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. ఈ రోజు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నాగం స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగం జనార్దన్ రెడ్డి నీటి హక్కులు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనుల అలసత్వంపై నాగం ద్వజమెత్తారు.
కృష్ణాపరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు మాత్రమే నీటి హక్కు ఉంటుందని ఆ నీటిని తరలించడానికి ప్రభుత్వానికి కూడా హక్కు ఉoడదా అనీ, నీటి తరలింపులపై మరో మారు నీటి ఉద్యమం చేపడతానని ప్రాజెక్టులపై ఈ ప్రాంత ఎంపీలకు, ఎమ్మెల్యే(MLA)లకు, ఎమ్మెల్సీలకు చిత్తశుద్ధి లేదని రెండు సంవత్సరాలు అయినా ప్రాజెక్టుల నీటి వ్యవస్థ కాలువల పనులు, రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టడంలో విఫలమయ్యారని నాగం దుయ్యబట్టారు.

వాస్తవంగా కల్వకుర్తి లో లిఫ్ట్ రెండు మోటార్లే పనిచేస్తున్నాయని మిగతా మూడు మోటర్లు ఎందుకు పనిచేయడం లేదని, అవి ఎందుకు పూర్తి చేయడం లేదన్నారు. అదేవిధంగా వట్టెం రిజర్వాయర్ కుమ్మెర దగ్గర ఉన్న మోటార్లు కూడా రెండే పనిచేస్తున్నాయని అవి కూడా ఎందుకు పనిచేయడం లేదని ఉత్తంకుమార్ రెడ్డిని నిలదీశారు.
ప్రాజెక్టులపై వీరికి చిత్తశుద్ధి లేదని కేలైని సందర్శించాలని ఆ పనులు పర్యవేక్షించాలని హెలికాప్టర్ల పై తిరిగి సమీక్షలు చేస్తే తెలియదని భూమిపై నిలబడి ఆ ప్రాంతాన్ని సందర్శిస్తే వాస్తవాలు పనుల నిర్వహణ తెలుస్తుందని నాగం, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఉత్తముడే కాని పనివంతుడు కాదని అపహాస్యం చేశారు. వాస్తవంగా నల్గొండ జిల్లాలో 14 లక్షల ఎకరాలకు సాగునీరు పారాల్సి ఉండగా 12 లక్షల ఎకరాలకు మాత్రమే పారుతున్నదన్నారు.
కానీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 32 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా ఏడు లక్షలకు మొత్తంగా కూడా నీరు పారడం లేదని ఆయన వివరించారు. ఈ ప్రజాప్రతినిధులు కృష్ణా నీటిని ఇతర ప్రాంతాలకు ఎలా తరలిస్తారని డిండి ప్రాజెక్టుకు నీటిని ఎలా తీసుకువెళ్తారని నాగం ప్రభుత్వాన్ని నిలదీశారు. కుమ్మర మోటర్ల మునుకపై విచారణ జరిపించాలని నాగం డిమాండ్ చేశారు.
కృష్ణా జలాల నీటి హక్కు పై ఈ ప్రాంత వాసులకే హక్కు ఉంటుందని నీటి రంగ నిపుణుడు గుల్హాటి, కోస్తా కమిషన్ చెప్తున్నదని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు చట్టాలను చదవాలని ఆయన హితవు పలికారు. నీటి హక్కుల కోసం నీటిని తరలించకుండా ఆపేందుకు అవసరమైతే మరో నీటి ఉద్యమం చేపడతానని అందర్నీ కలుపుకొని ముందుకు సాగుతానని నాగం అన్నారు.
టీఆర్ఎస్ పార్టీతో కూడా సంప్రదించి పోరాట కార్యక్రమాన్ని చేపడతానని ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై చేపడుతున్న పోరాటక్రమానికి తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నానని నాగం చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు అర్థం రవి, బాలగౌడ్, లక్సమయ్య తదితరు శాఖలు పాల్గొన్నారు.
