AP | ఏపీఈ సెట్ కన్వీనర్ గా ప్రొఫెసర్ దుర్గా ప్రసాద్..
ఏపీఈ సెట్ కన్వీనర్‌గా అనంతపురం జేఎన్‌టీయూ అకడమిక్ ఆడిట్ డైరెక్టర్.. ప్రొఫెసర్ బండారు దుర్గాప్రసాద్ ఆదివారం నియమితులయ్యారు.
ప్రస్తుతం బండారు దుర్గాప్రసాద్ అనంతపురంలోని జేఎన్‌టీయూ యూనివర్సిటీకి అకడమిక్ ఆడిట్ డైరెక్టర్‌గా ఉన్నారు. అంతకుముందు మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతిగా, ఇంజినీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్‌గా, OTPRI డైరెక్టర్‌గా పనిచేశారు.