మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ (Maktal) పట్టణంలోని అయోధ్య నగర్ బ్రాహ్మణవాడలో వెలసిన శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి (Venkateswara Swamy) వారి 60వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు తిరువీధి కార్యక్రమం నిర్వహించారు. స్వామివారు సూర్యప్రభ వాహనం (Suryaprabha Vahanam)పై ఊరేగారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తుల గోవింద నామ స్మరణల మధ్య స్వామివారి సూర్యప్రభ వాహన సేవ వైభవోపేతంగా సాగింది.
అనంతరం స్వామి వారికి మహామంగళహారతి ఇత్యాది కార్యక్రమాలను నిర్వహించారు. అంతకుముందు స్వామివారికి సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త శ్యాంసుందర్ జోషి, సభ్యులు డి.వి.చారి, కరణం గోవిందరావు, వాదిరాజు, హన్మేష్ చారి, గోపాల చారి, కృష్ణ చారి, అరవింద చారి, వంశీజోషి తదితరులు పాల్గొన్నారు.

