problems | నాగిరెడ్డిపల్లిని అభివృద్ధి చేస్తా..
- అవకాశమివ్వండి
- కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి గోవింద్ గౌడ్
problems | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నాగిరెడ్డిపల్లి గ్రామ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి(candidate) గోవింద్ గౌడ్ అన్నారు. మరో అవకాశం కల్పిస్తే మంత్రి సహకారంతో మరింత అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ఇవాళ నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లిలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజల ఆశీస్సులతో తన భార్య మాజీ సర్పంచ్ స్వాతి హయాంలో ఐదేళ్లు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు.
మరోసారి అవకాశం కల్పిస్తే గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలు(problems) పరిష్కరించి గ్రామ రూపురేఖలు మారుస్తానన్నారు. మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో గ్రామంలో రేషన్ దుకాణం ఏర్పాటు చేయడంతో పాటు అంగన్వాడీ భవనం నిర్మిస్తూ నాగిరెడ్డిపల్లి గ్రామం నుండి కొల్లూరు సమస్తాపూర్ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తానన్నారు.
గత ఎన్నికల్లో తమ గ్రామాన్ని నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయగా, మహిళకు రిజర్వేషన్ కావడంతో గ్రామం ఎంతో అభివృద్ధి చెందిందని, మరోసారి అవకాశం కల్పిస్తే గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలరుణం తీర్చుకుంటానన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలు అర్హులందరికీమంజూరు చేస్తానన్నారు.
ఐదేళ్లలో గ్రామంలో డ్రైనేజీలు, సీసీ రోడ్లు ఏర్పాటు చేయడంతో పాటు బీటీ రోడ్డు సౌకర్యం కల్పించినట్లు ఓటర్లకు వివరించారు. ప్రజలు నిస్వార్థంగా సేవలు చేసే తనను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవకుడిగా పనిచేసి ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ స్వాతి గోవింద గౌడ్, వార్డు అభ్యర్థులు, తదితరులు పాల్గొన్నారు.

