ప్ర‌తిప‌క్షాల నాట‌కాలు

ప్ర‌తిప‌క్షాల నాట‌కాలు

ఉమ్మడి మెదక్ బ్యూరో, ఆంధ్ర ప్రభ : రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు నాట‌కాలాడుతున్నాయ‌ని, ప్రభుత్వ ఆసుపత్రులపై బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా(Minister Damodara Raja Narsimha) అన్నారు. ఈ రోజు మీడియాతో మాట్లాడారు. బస్తీ దవాఖాన్ల ద్వారా ప్రతి రోజూ సుమారు 45 వేల మంది రోగుల‌కు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అన్నిరకాల మందులు బస్తీ దవాఖానాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు.

డయాగ్నస్టిక్స్ హబ్స్(Diagnostics Hubs) ద్వారా బస్తీ దవాఖాన్లకు వచ్చే రోగుల‌కు 134 రకాల టెస్టులు చేయిస్తున్నామని, 24 గంటల లోపు టెస్ట్ రిపోర్టులు అందజేస్తున్నామని, బస్తీ దవాఖాన్లలో మెరుగైన వైద్య సేవలు అందుతునాయని వివ‌రించారు.

గాంధీ, ఉస్మానియా హాస్పిటళ్లపై పేషెంట్ల రద్దీ తగ్గిందని, ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని మంత్రి అన్నారు. పేదలకు వైద్య సేవలు అందించే ప్రభుత్వ హాస్పిటళ్లపై కొంతమంది బురద జల్లుతున్నార‌ని అన్నారు. ప్ర‌జ‌ల‌కు ఆస్ప‌త్రుల‌పై నమ్మకం సన్నగిల్లేలా చేయడం దురదృష్టకరన్నారు.

ప్రైవేటు హాస్పిటళ్ల(Private Hospitals)కు లబ్ది చేకూర్చే విధంగా వారు వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ప్రజలు వారి తీరును గమనిస్తున్నారని, సరైన సమయంలో వారికి ప్రజలే గుణపాఠం చెబుతారని మంత్రి దామోదర స్పష్టం చేశారు.

Leave a Reply