Prime Minister | మోడీ విమర్శలు

Prime Minister | మోడీ విమర్శలు
Prime Minister | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీకి అవగాహన లేదని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు సంధించారు. ఇవాళ కేరళలోని ఎర్నాకులంలో ప్రధాని మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ప్రధాని మోడీ మండిపడ్డారు. దేశ యువతపై ఆయనకు అవగాహన లేదంటూ రాహుల్ తీరును ఎండగట్టారు. దేశ అభివృద్ధిని కాంగ్రెస్ యువరాజు చూడలేక పోతున్నారంటూ రాహుల్ తీరుపై మండిపడ్డారు.
యుద్ధం పేరుతో తనను కాంగ్రెస్ పార్టీ దూషిస్తోందని తెలిపారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంపై కాంగ్రెస్, వామపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు. గల్ఫ్‌లో భారతీయులు చిక్కుకోవాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందన్నారు. ఆయా దేశాల్లోని భారతీయులను కాపాడేందుకు కేంద్రం అన్ని ఏర్పాట్లు చేస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
