Prices|రైతులకు అందుబాటులో బోర్ వెల్ ధరలు..

Prices|రైతులకు అందుబాటులో బోర్ వెల్ ధరలు..
Prices| రాప్తాడు, ఆంధ్రప్రభ: దేశీయ మార్కెట్ లో బోరు డ్రిల్లింగ్ బిట్లు రోజురోజుకీ వేలల్లో పెరిగిపోతుండడం వలన పాత ధరలకు బోర్లు వేయాలంటే వ్యాపారస్తులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని జిల్లా బోర్ వెల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్.భాస్కర్ నాయుడు పేర్కొన్నారు. రాప్తాడు మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారి ప్రక్కన గ్రౌండ్ లో ఉమ్మడి జిల్లా బోర్ వెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులకు ప్రజలకు తక్కువ ధరకు లారీ బోర్ వెల్స్ ద్వారా బోర్లు వేసే వాళ్ళమని జిల్లా అధ్యక్షులు ఎన్. భాస్కర్ నాయుడు అన్నారు.
బోర్లు వేసే బిట్టుకు అవసరమయ్యే రా మెటీరియల్ యామర్ ధరలు పెరగడంతో 6 1/2 ఇంచుల బిట్టు ధర జనవరి నెలలో రూ.20000 ఉండగా ప్రస్తుతం అదే బిట్టు ధర రూ.40000 వేలు నుండి రూ.55000 ఉంది. ఉన్న ఫలంగా బిట్లు ధరలు పెరుగుతూ ఉండటంతో బోర్ వెల్స్ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. గతంలో రైతులకు ప్రజలకు ఒక బోరు వెయ్యాలంటే ఒక్క అడుగు రూ.85 నుండి రూ.100 గా తీసుకునే వాళ్ళము. ఇప్పుడు ఆ పాత ధరకు బోరు వెయ్యలేకపోతున్నాము. ఎందుకంటే బిట్లు ధరలు పెరగడంతో బోర్ వెల్స్ నిర్వాహకులకు గిట్టుబాటు కావడం లేదు. భారీగా నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. అయినా కానీ ఉమ్మడి జిల్లా రైతులు ప్రజల మీద భారం ఎక్కువగా మోపకుండా ఉండే విధంగా ధరను నిర్ణయించామన్నారు.
జిల్లా అసోసియేషన్ తీర్మానం మేరకు ఫిబ్రవరి 15 నుండి ఒక్క అడుగుకి రూ.110 నుండి రూ.125 వరకు తీసుకోవాలని ధర నిర్ణయించామని తెలిపారు. రైతులను దృష్టిలో పెట్టుకొని నామమాత్రపు ధరలు నిర్ణయించామన్నారు. బోరు వేసే బిట్లు ధరలు పెరిగిన విషయాన్ని రైతులు ప్రజలు అర్థం చేసుకొని పెంచిన ధరను దృష్టిలో పెట్టుకొని బోర్లు వేయించుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కే.ఆదిరెడ్డి కే. వెంకటరామిరెడ్డి టి.సోము సుధాకర్ రెడ్డి ఎం. రాముడు ఎస్.శివ రెడ్డి ఎస్.నారాయణరెడ్డి ఎన్. నాగరాజు డి.రాజశేఖర్ చిదంబర్ పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
