Prices | కొంచెం ఇష్టం. కొంచెం క‌ష్టం..!

వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 9వ సారి ప్ర‌వేశ పెట్టిన బడ్జెట్‌లో తీసుకున్న నిర్ణ‌యాల‌తో పలు రంగాలకు ఊరటనిచ్చారు. విదేశీ విద్య, ఆరోగ్యం, పర్యావరణ రంగాలకు సంబంధించిన వస్తువుల ధరలు తగ్గగా, నిబంధనల ఉల్లంఘన, ట్రేడింగ్‌పై భారాలు పెరిగాయి.

Prices | వీటి ధరలు పెరుగుతాయి..

  • ఆదాయపు వివరాలు సరిగ్గా చూపనివారికి విధించే జరిమానా 100% పెంపు
  • బహిర్గతం చేయని చరాస్థులపై ఇప్పుడు జరిమానా విధింపు
  • ఫ్యూచర్స్-ఆప్షన్స్ ట్రేడింగ్
  • విలాసవంతమైన వాచ్లు, ఆల్కహాల్, సిగరెట్లు, బీడీలు, పాన్ మసాల, గుట్కా,
  • కాఫీ రోస్టింగ్, బ్రూవింగ్, వెండింగ్ యంత్రాలు
  • కొన్ని రకాల ఎరువులపై దిగుమతి ఫీజులను తొలగించారు. అమోనియం పాస్ఫేట్, అమోనియం నైట్రో పాస్ఫేట్ వంటి వాట ధరలు పెరగొచ్చు.
  • చిత్రీకరణకు వాడే పరికరాలు, కెమెరాలు

Prices | వీటి ధరలు త‌గ్గుతాయి..

  • విదేశీ ప్రయాణాలు: విదేశీ టూర్ ప్యాకేజీలపై TCS (టాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) 5-20% నుండి 2% కి భారీగా తగ్గింది.
  • విదేశీ విద్య: విదేశాలలో చదువుకునే విద్యార్థుల ఖర్చులపై TDS తగ్గించారు.
  • ఆరోగ్యం: క్యాన్సర్, అరుదైన వ్యాధుల నివారణకు వాడే మందులపై దిగుమతి సుంకం రద్దు చేశారు.
  • ఎలక్ట్రానిక్స్: మైక్రోవేవ్ ఓవెన్లు, వ్యక్తిగత అవసరాల కోసం విదేశాల నుండి తెచ్చుకునే వస్తువుల ధరలు తగ్గనున్నాయి.
  • పర్యావరణం: సోలార్ ప్యానెల్ తయారీకి వాడే సోలార్ గ్లాస్, కీలక ఖనిజాల వెలికితీతకు వాడే యంత్రాలపై పన్నులు తగ్గించారు.
  • తయారీ రంగం: విమానాల విడిభాగాలు, బూట్ల తయారీకి వాడే పైభాగం ఎగుమతులపై రాయితీలు ఇచ్చారు.
  • ఇతరాలు: భారతీయ మత్స్యకారులు సముద్రం నుంచి తెచ్చే చేపలు, మద్యం తయారీకి వాడే స్క్రాప్ ధరలు తగ్గనున్నాయి.

Leave a Reply