Press Club | అసత్య ఆరోపణలు మానుకోవాలి…

Press Club | అసత్య ఆరోపణలు మానుకోవాలి…

Press Club | చెన్నూర్, ఆంధ్రప్రభ : నిన్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మంత్రి వివేక్ వెంకటస్వామి పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రఘునాథ్ అన్నారు. ఇవ్వాళ స్థానిక ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ నాయకులతో కలిసి సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా రఘునాథ్ మాటాడుతూ చెన్నూరు.

నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి పై అసత్యపు ఆరోపణలు చేస్తూ, అసలు చెన్నూరు నియోజకవర్గాన్ని తానే అభివృద్ధి చేశానంటూ గొప్పలు చెప్పుకున్న బాల్క సుమన్ ఏo అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుంటే అది చూసి ఓర్వలేని బాల్క సుమన్, మంత్రి వివేక్ పై నిందలు వేయడం సరికాదని చెన్నూరు మండలంలోని సోమనపల్లి గ్రామంలో సుమారు 250 కోట్ల రూపాయలతో నిర్మించబోతున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ అలాగే చెన్నూరు పట్టణంలో సుమారు 100 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. ఎవరి హయం లో ఏ ఏ అభివృద్ధి జరింగింది, ఎం జరుగబోతుందో తెలుసుకోలేని పరిస్థితుల్లోప్రజలు లేరన్న విషయాన్నీ బాల్క సుమన్ తెలుసుకోవాలని హితావు పలికారు.

Leave a Reply