Presidents | హుజూర్‌నగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గా గెల్లి రవి నియామకం

Presidents | హుజూర్‌నగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గా గెల్లి రవి నియామకం

Presidents | హుజూర్‌నగర్ ,ఆంధ్రప్రభః హుజూర్‌నగర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గా గెల్లి రవి ని నియమిస్తూ సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య సోమవారం నియామక ఉత్తర్వులు జారీచేసి నియామకపత్రం అందజేశారు. ఇప్పటి వరకు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గా ఉన్న తన్నీరు మల్లికార్జున్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ గా ఎన్నిక కావడంతో ఆ స్థానంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రధాన అనుచరుడు, హుజూర్‌నగర్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ గెల్లి అర్చన భర్త ఐన గెల్లి రవి ని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గా నియమించారు. వీరితో పాటు పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గా తేజావత్ రాజానాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా సుంకరి శివరాం, జాయింట్ సెక్రటరీ గా గంజి శివ లను నియమించారు.

Leave a Reply