పేద విద్యార్థికి ఎంసెట్ కోచింగ్‌కు ఆర్థిక సహాయం

పేద విద్యార్థికి ఎంసెట్ కోచింగ్‌కు ఆర్థిక సహాయం
- వైరా ఎస్ ఐ పుష్పాల రామారావు చేతుల మీదుగా అందజేత…
వైరా, ఆంధ్రప్రభ : వైరా మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో నివసిస్తున్న నిరుపేద విద్యార్థిని పొదిల లక్ష్మీ ప్రసన్నకు ఎంసెట్ కోచింగ్ కోసం బీఆర్ఎస్ నాయకులు ఆదివారం ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సహాయాన్ని బీఆర్ఎస్ నాయకుడు కారుకొండ బోస్ ఆధ్వర్యంలో వైరా ఎస్సై పుష్పాల రామారావు చేతుల మీదుగా రూ.10,000 అందించారు.
లక్ష్మీ ప్రసన్న తండ్రి పొదిల వెంకటనారాయణ రోజువారీ కూలీగా పని చేస్తుండటంతో కుటుంబ ఆర్థిక పరిస్థితిని గుర్తించిన బీఆర్ఎస్ నాయకులు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఎస్సై రామారావు మాట్లాడుతూ, లక్ష్మీ ప్రసన్న పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కట్ట కృష్ణార్జునరావు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు నాగబత్తిని భాస్కర్, కొత్త వెంకటేశ్వరరావు, కిలారు కిరణ్, వైరా పట్టణ అధ్యక్షుడు అప్పం సురేష్, ఏదునూరి శ్రీనివాసరావు, షేక్ కౌసర్ అజీజ్, బత్తుల వెంకటేశ్వరరావు, ఉప్పు వెంకటేశ్వరరావు, మాచర్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.
