ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు…

ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు…
మంథని, ఆంధ్రప్రభ : రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోళ్లు చేపడుతామని మంథని ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న(Kududula Venkanna) అన్నారు. ఈ రోజు మంథని ఏఎంసీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ ఎక్లాస్ పూర్ సెంటర్ ను కూడా ప్రారంభించారు.
ఈ సందర్భంగా కుడుదుల వెంకన్న మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ప్రకారం ధాన్యం కొనుగోలు చేస్తారని అన్నారు. కొత్త శ్రీనివాస్(New Srinivas) మాట్లాడుతూ.. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలను ప్రారoభించుకున్నామని తెలిపారు. ధాన్యం తడిసినప్పటికి రైతులు ఏ మాత్రం అధైర్య పడవద్దని, ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని అన్నారు.
రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వ మద్దతు ధరతో పాటు సన్న వడ్లు క్వింటాల్ కు రూ.500 బోనస్ పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం ఉపాధ్యక్షుడు బెల్లంకొండ ప్రకాష్ రెడ్డి(Bellamkonda Prakash Reddy), డైరెక్టర్లు ఆకుల రాజబాబు, పెద్దిరాజు ప్రభాకర్, రావికంటి సతీష్ కుమార్, లెక్కల కిషన్ రెడ్డి, కొత్త శ్రీనివాస్, దాసరి లక్ష్మి-మొండయ్య, దేవల్ల విజయ్ కుమార్, ఏఎంసీ ఉపాధ్యక్షుడు ముస్కుల ప్రశాంత్ రెడ్డి, తదితరు పాల్గొన్నారు.
