Prabhas | సినిమాల లైనప్ ఏంటి..?

Prabhas | సినిమాల లైనప్ ఏంటి..?

Prabhas | ప్రభాస్ – ప్రశాంత్ వర్మ మూవీ క్యాన్సిల్ అయ్యిందా?
హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ డిమాండ్ పెరిగింది
వైరల్ అవుతున్న క్యాన్సిల్ వార్తల్లో నిజం ఏంటి?
మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చిందేమిటి?
స్పిరిట్, ఫౌజీ తర్వాతే కొత్త ప్రాజెక్ట్
కల్కి 2, సలార్ 2 తర్వాత ప్రభాస్–ప్రశాంత్ వర్మ సినిమా?

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతికి రాజాసాబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్.. ఇప్పుడు దసరాకి ఫౌజీ మూవీతో రాబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రభాస్.. ప్రశాంత్ వర్మతో భారీ సినిమా చేసేందుకు ఓకే చెప్పారని గతంలో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ క్రేజీ మూవీ క్యాన్సిల్ అయ్యిందని.. న్యూస్ వైరల్ అయ్యింది. ఇది నిజమా..? లేక గాసిప్పా…?

Prabhas

ప్రశాంత్ వర్మ.. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆ సినిమా బాలీవుడ్ జనాలకు విపరీతంగా నచ్చేసింది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయం సొంతం చేసుకుంది. దీంతో ప్రశాంత్ వర్మకు డిమాండ్ పెరిగింది. టాలీవుడ్ స్టార్స్ మాత్రమే కాదు.. బాలీవుడ్ స్టార్స్ సైతం ప్రశాంత్ వర్మతో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ సింగ్.. ప్రశాంత్ వర్మతో సినిమా చేయాలి అనుకున్నారు కానీ.. కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ కుదరలేదు.

Prabhas

ఆ టైమ్ లో ప్రశాంత్ వర్మ.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు కథ చెప్పారని.. ఆ కథకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా టాక్ వినిపించింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇది నిజమా..? లేక గాసిప్పా..? అనేది హాట్ టాపిక్ అయ్యింది. వైరలైన ఈ వార్త పై మూవీ టీమ్ స్పందించింది. ప్రచారంలో ఉన్న వార్తలో వాస్తవం లేదని.. అంతా ప్లానింగ్ ప్రకారమే జరుగుతుందని.. సరైన టైమ్ చూసి ఈ సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తామని తెలియచేసింది. ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్, ఫౌజీ సినిమాలు చేస్తున్నారు. వీటి తర్వాత కల్కి 2, సలార్ 2 చేయాలి. ఆతర్వాత ప్రశాంత్ వర్మ, ప్రభాస్ మూవీ ఉంటుందని సమాచారం.

Prabhas

Leave a Reply