Prabhas – Ntr | నీల్ ప్లాన్ ఇదేనా..?

Prabhas – Ntr | నీల్ ప్లాన్ ఇదేనా..?
Prabhas – Ntr | సలార్ 2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్
ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీపై భారీ అంచనాలు
సలార్ తరహాలో రెండు పార్టులుగా డ్రాగన్?
ప్రశాంత్ నీల్ మాస్ ప్లాన్ ఇదేనా?
Prabhas – Ntr | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఈ ఇద్దరి కాంబోలో రూపొందిన మూవీ సలార్. ఈ సినిమా (Movie) ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ మూవీకి సెకండ్ పార్ట్ ఉందని అనౌన్స్ చేశారు కానీ.. ఇంత వరకు పట్టాలెక్కలేదు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు సలార్ బాటలో ఎన్టీఆర్ డ్రాగన్ అంటూ వార్తలు రావడం ఆసక్తిగా మారింది. ఇంతకీ.. సలార్ కి, డ్రాగన్ కి లింక్ ఏంటి..? ప్రశాంత్ నీల్ ప్లాన్ ఏంటి..?
Prabhas – Ntr | త్వరలో సెట్స్ పైకి సలార్ 2
సలార్ మూవీ ప్రభాస్.. కి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించింది. ఇంకా చెప్పాలంటే.. ప్రభాస్ ని ఊర మాస్ గా, పవర్ ఫుల్ గా అభిమానులు ఎలా చూడాలి అనుకున్నారో అలా చూపించారు. దీంతో ఈ సినిమా కథ ఎలా ఉన్నా.. ప్రభాస్ (Prabhas) క్యారెక్టర్ మాత్రం జనాలకు విపరీతంగా నచ్చేసింది. అందుకనే.. సలార్ పార్ట్ 2 కోసం అభిమానులే కాదు.. సామాన్య ప్రేక్షకులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల సలార్ ప్రొడ్యూసర్ విజయ్ కిరగందూర్.. త్వరలోనే సలార్ 2 సెట్స్ పైకి వస్తుందని తెలియచేశారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ సలార్ 2 అప్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.

Prabhas – Ntr | డ్రాగన్ రెండు పార్టులా…?
ఇదిలా ఉంటే.. సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇటీవల జోర్డాన్ లో ఎన్టీఆర్ తో పాటు ప్రధాన తారాగణం పై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఎన్టీఆర్ ను ఇంత వరకు ఎవరూ చూపించని విధంగా చాలా పవర్ ఫుల్ గా చూపించబోతున్నాడట ప్రశాంత్ నీల్ (Prashanth Neel). అయితే.. సలార్ సినిమాని ఎలాగైతే రెండు పార్టులుగా తీస్తున్నారో.. పార్ట్ 1 టైమ్ లోనే సలార్ 2 కు సంబంధించిన కీలక సన్నివేశాలు తీసినట్టుగా.. డ్రాగన్ మూవీని కూడా రెండు పార్టులుగా తీయాలి అనుకుంటున్నారని.. ఫస్ట్ పార్ట్ చేస్తున్నప్పుడే సెకండ్ పార్ట్ కు సంబంధించి కీలక సన్నివేశాలు కూడా షూట్ చేయనున్నారని టాక్. అయితే.. ఇది నిజమేనా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.

