రైతులకు ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్
కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని కొండా లక్ష్మన్(Konda Lakshman) తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వ విద్యాలయం పసుపు పరిశోధన కేంద్రాన్ని స్పైస్ బోర్డ్(Spice Board) వరంగల్ ఆధ్వర్యంలో నెక్కొండ, కేసముద్రం, చింతపల్లి, ఒడిస్సా లకు చెందిన 40 మంది రైతులు ఈ రోజు సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా పసుపు పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి. మహేందర్(Dr. B. Mahender) మాట్లాడుతూ.. రైతులకు ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్(PowerPoint Presentation) ద్వారా పసుపు పంటలపై మెలకువల గురించి వివరించినట్లు తెలిపారు. పరిశోధన స్థానంలోని పసుపు రకాలు, యంత్రాలు, పరిశోధనలు రైతులు పరిశీలించినట్లు తెలిపారు. పసుపులో వివిధ రకాలు, పసుపు సాగు పద్ధతులు, పసుపు వంగడాలు, ల్యాబ్, పంటలపై ఆశించే చీడపీడలు, వాటి నివారణ చర్యలు, వాల్యూ ఎడిషన్(Value Edition)లపై అవగాహన కల్పించినట్లు తెలిపారు.
రైతులు ఒక గ్రూపుగా నెక్కొండ ఎఫ్ పిఓ(Nekkonda FPO)తో పసుపు పరిశోధన కేంద్రాన్ని సందర్శించినట్లు తెలిపారు. ఇందులో వీరికి కురుకుమిన్ పరీక్షించే విధానం గురించి, సాగు విధానం, ఎరువులు యాజమాన్యం, సస్యరక్షణ, నూతన యాంత్రికరణ, ఆధునిక పద్ధతుల ఎరువుల యాజమాన్యం, పసుపు కుటీర పరిశ్రమగా అభివృద్ధి చెందే మార్గాల గురించి క్లుప్తంగా వివరించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త భాస్కర్ శ్రీనివాస్(Bhaskar Srinivas), శ్రీనివాస్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

