Power Star | ఉస్తాద్ ఫస్ట్ సింగిల్.. ఇక పండగే..

Power Star | ఉస్తాద్ ఫస్ట్ సింగిల్.. ఇక పండగే..

Power Star

Power Star, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ (Pawan kalyan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీని హరీష్‌ శంకర్ తెరకెక్కిస్తున్నారు. వీరద్దరి కాంబోలో గబ్బర్ సింగ్ మూవీ రావడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ మూవీ పై ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తామని అప్ డేట్ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫస్ట్ సింగిల్ ఎప్పుడు వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు మేకర్స్ ఈ క్రేజీ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఎప్పుడు వస్తుందో అనౌన్స్ చేశారు.

Power Star | సమ్మర్ లో రిలీజ్ చేయడానికి

ఈ సినిమాలోని మొదటి పాట ప్రోమోను డిసెంబర్ 9న సాయంత్రం 6:30 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. మీరు ప్రేమించిన, ఈలలు వేసిన పవర్ స్టార్ ఇప్పుడు మరింత శక్తితో, సరికొత్త యాటిట్యూడ్‌తో రాబోతున్నారు అంటూ చిత్ర యూనిట్ ఈ పాటపై అంచనాలను పెంచింది. ఈ పాటను ప్రముఖ బాలీవుడ్ సింగర్ విశాల్ దద్లానీ ఆలపించగా, భాస్కరభట్ల సాహిత్యం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి.. ఈ పవర్ స్టార్ సాంగ్ ఎలా ఉంటుందో.. ఏ రేంజ్ లో యూట్యూబ్ లో సందడి చేస్తాడో చూడాలి.

click here to read Allu Arjun | ఆ ఆరుగురిలో నెక్ట్స్ ఎవరితో..?

click here to read more

Leave a Reply