పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ OG నుంచి ఆయన పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ స్పెషల్ గ్లింప్స్‌లో పవన్ మాస్ లుక్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకోగా, విలన్‌గా కనిపిస్తున్న ఇమ్రాన్ హష్మీ పవర్‌ఫుల్ ఎలివేషన్స్‌తో సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచేశాడు.
సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. థమన్ అందిస్తున్న సంగీతం ఇప్పటికే ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం చిత్రబృందం ప్రమోషన్లను వేగంగా ముందుకు తీసుకెళ్తోంది.