ఈ ప్రాంతాల్లో నేడు ప‌వ‌ర్ క‌ట్ !

ఎడపల్లి, ఆంధ్రప్రభ: బోధన్‌ డివిజన్‌ పరిధిలోని బోధన్‌ రూరల్‌, ఎడపల్లి, రెంజల్‌ మండలాల్లో ఈరోజు (మూడవ శనివారం) విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉండనున్నట్లు డివిజన్‌ ఏడీఈ నాగేష్‌కుమార్‌ తెలిపారు.

బోధన్‌ రూరల్‌లోని కల్దుర్కి, సంగెం, రెంజల్‌ మండలంలోని తాడ్‌ బిలోలి, ఎడపల్లి మండలంలోని ఠాణా కళాన్‌లో గల 33/11 కెవి విద్యుత్‌ ఉపకేంద్రాల్లో మూడవ శనివారం నిర్వహించే నియమిత మరమ్మత్తు పనుల కారణంగా మధ్యాహ్నం 3 గంటలనుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply