NZB | పొట్టి శ్రీరాములు విద్యాలయం పేరు మార్పు… సీఎం దిష్టిబొమ్మ ద‌గ్ధం

నిజామాబాద్ ప్రతినిధి, మార్చి18 (ఆంధ్రప్రభ) : పొట్టి శ్రీరాములు విద్యాలయం పేరుమార్పు వైశ్య జాతికే అవమానమని ఇందూర్ ఆర్యవైశ్యులు ముక్తకంఠంతో నిరసన వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు పేరుమార్పుపై ప్రభుత్వం పునారాలోచన చేయాలని ఆర్యవైశ్యులు డిమాండ్ చేశారు. పొట్టి శ్రీరాములు విద్యాలయం పేరుమార్పుపై ఇందూరులో భగ్గుమన్న ఆర్యవైశ్యులు.. మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ నుంచి ఆర్యవైశ్యులు భారీ సంఖ్యలో పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం ధర్నా చౌక్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆర్యవైశ్యుల ముద్దుబిడ్డ ఆయన పొట్టి శ్రీరాములు పేరు మార్పును వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకోకుంటే పెద్ద ఎత్తున ఆర్య వైశ్యులు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆర్యవైశ్యుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి పేరు మార్పుపై పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *