శ్రీరామలింగేశ్వర స్వామి జాతర పోస్టర్ ఆవిష్కరణ

శ్రీరామలింగేశ్వర స్వామి జాతర పోస్టర్ ఆవిష్కరణ
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురం గ్రామంలో ఏప్రిల్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు నిర్వహించే శ్రీ రామలింగేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం వేడుకలు, జాతర పోస్టర్ ను శుక్రవారం స్థానిక శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి-లక్ష్మీ దంపతులు ఆవిష్కరించారు.
రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ దీప శ్యాంసుందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గం ఎన్నికల ఇంఛార్జ్, డీసీసీ ఉపాధ్యక్షులు పబ్బు రాజు గౌడ్, శ్రీ ఆంధోల్ మైసమ్మ దేవస్థానం చైర్మన్ కంచర్ల అశ్విన్ రెడ్డి, వార్డు సభ్యులు సుక్క రవీందర్, ఈడుదుల ఇంద్రసేన యాదవ్, షేక్ అంజుం అంజద్, పక్కిర్ వంశీధర్ రెడ్డి, ఉప్పరి అనిల్ కుమార్, రామలింగేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తలు సిలువేరు శంకర్, ఎల్లంకి లింగాచారి, దౌడి లింగస్వామి, జెర్రిపోతుల అఖిల మహేందర్, ఆంధోల్ మైసమ్మ తల్లి దేవస్థానం ధర్మకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈడ్దుల హరిప్రసాద్, చామట్ల శ్రీనివాస్, బొంతల యువరాజ్, గుండ్ల అశోక్, ఈడ్దుల బాబు యాదవ్, ఈడ్దుల కేశవ్ యాదవ్, బుర్ర శివ కుమార్ గౌడ్, బుర్ర విజయ్ గౌడ్, పక్కిర్ వంశీధర్ రెడ్డి, మహంకాళి పృధ్వీ తదితరులు పాల్గొన్నారు.
