వీరాపూర్‌లో యువకుడి ఆత్మహత్య..

వీరాపూర్‌లో యువకుడి ఆత్మహత్య..

బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండలంలోని వీరాపూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మెరుగు భాగ్యరెడ్డి(35) చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply