Possession | 43కిలోల హెరాయిన్, గ్రెనేడ్లు స్వాధీనం

Possession | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : పోలీసులు పంజాబ్ సరిహద్దుల్లో భారీ కుట్రను భగ్నం చేశారు. అమృత్సర్ రూరల్ పోలీసులు మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాపై మెరుపు దాడి చేశారు. విలేజ్ డిఫెన్స్ కమిటీ ఇచ్చిన సమాచారం మేరకు చేపట్టిన ఈ ఆపరేషన్‌లో 42.983 కిలోల హెరాయిన్, 4 హ్యాండ్ గ్రెనేడ్లు, ఒక పిస్టల్, 46 లైవ్ బులెట్లు, ఒక మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు.
