అల్లు వారింట తీవ్ర విషాదం..

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్: ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, దివంగత నటుడు అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నం (94) శనివారం తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో అల్లు కుటుంబంలో, తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె అల్లు అర్జున్ నానమ్మ. ఆమె అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం కోకాపేటలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్, ముంబైలో అట్లీ సినిమా షూటింగ్‌లో ఉండగా, వెంటనే హైదరాబాద్‌కు బయలుదేరారు.

అల్లు కనకరత్నం మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అల్లు కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. అల్లు రామలింగయ్యతో ఆమె జీవిత ప్రయాణం, అల్లు అరవింద్‌ను ప్రముఖ నిర్మాతగా తీర్చిదిద్దడంలో ఆమె పాత్ర ఎంతో ఉంది. ఆమె మృతి కుటుంబానికి తీరని లోటు. ఈ దుఃఖ సమయంలో అల్లు కుటుంబానికి అండగా నిలవాలని పలువురు కోరుతున్నారు.

Leave a Reply