Ponduru | పేద‌ల సంక్షేమ‌మే ధ్యేయం

Ponduru | పేద‌ల సంక్షేమ‌మే ధ్యేయం

  • బట్టల పంపిణీ చేసిన ఎమ్మెల్యే రవికుమార్

Ponduru | పొందూరు(ఆముదాలవలస), ఆంధ్రప్రభ : పొందూరు మండలం కింతలి గ్రామంలో దుంపల సన్యాసి రావు ఆర్థిక సహకారంతో నిర్వహించిన బట్టల పంపిణీ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆముదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామంలోని పేదలకు బట్టలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కూన రవికుమార్ మాట్లాడుతూ, పేదలు, నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో అవసరమైన వారికి చేయూతనివ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. దుంపల సన్యాసి రావు సేవా మనసును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply