గోదావరి నీటితో చెరువులు నింపాలి

గోదావరి నీటితో చెరువులు నింపాలి
బజ్జుతండ సర్పంచ్ రవి రాథోడ్ పిలుపు
నల్లబెల్లి, ఆంధ్రప్రభ : గోదావరి జలాలతో చెరువులు నింపి పొలాలను పచ్చని మాగాణిలా చేయాలని బజ్జుతండ సర్పంచ్ రవి చిన్న రాథోడ్ రైతులకు సూచించారు. బజ్జుతండ, గుండ్లపహాడ్ శివారులో బంగారుకుంట, రెగ్యులకుంట, దేవతలకుంట చెరువులను రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. రైతులు సహకరిస్తే పొలాలు సస్యశ్యామలవుతాయని.. కాంట్రాక్టర్లు, అధికారులు చెరువులకు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లకావత్ ధర్మ, లునావత్ ఖాసీం, వార్డ్ మెంబర్లు అజ్మీరా రాందాస్, బానోత్ తిరుపతి, రామల్, అజ్మీరా రమేష్, కొమ్మాలు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
