Polnati Babji | రంగా.. అన్నివర్గాల నాయకుడు
- కాపు సంక్షేమ సంఘం కె 9, యూత్ వింగ్ ఆధ్వర్యంలో..
- ఘనంగా వర్ధంతి
- పార్టీలకతీతంగా హాజరైన కాపు సంఘ ప్రముఖులు
Polnati Babji | జంగారెడ్డిగూడెం, ఆంధ్రప్రభ : సామాజిక వర్గంతో సంబంధం లేకుండా అన్నివర్గాల వారికి నాయకుడిగా వంగవీటి మోహన రంగారావు (రంగా) గుర్తింపు పొందారని స్థానిక జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జి అన్నారు. రంగా వర్ధంతిని పురస్కరించుకొని కె 9కాపు సంక్షేమ సంఘం యూత్ వింగ్ ఆధ్వర్యంలో బాద రాల నరేష్ నాయుడు ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో కార్యక్రమం జరిగింది.ఈ రోజు లక్ష్మి టాకీస్ సెంటర్‌లోని రంగా విగ్రహానికి పూల దండలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ పార్లమెంట్ రావూరి కృష్ణ, దాకారపు కృష్ణ , కె 9కార్యదర్శి శీలం కృష్ణం రాజు, మెట్టప్రాంత కాపు సంఘం అధ్యక్షుడు వగ్వాల పుల్లారావు, కె 9 ప్రతినిధులు రాఘవ రాజు, అది విష్ణు, పారేపల్లి నరేష్, గణిత ఆనంద్ ప్రసాద్, మీడియా కన్వీనర్ కేఎస్ శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

