Polling | ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలి

Polling | ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలి

  • సిద్దిపేట కలెక్టర్ హైమావతి
  • మంతూరు, అనాజిపూర్‌లో ఓటింగ్ సరళి పరిశీలన

Polling | రాయపోల్, ఆంధ్రప్రభ : జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని, ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు లేకుండా పోలింగ్ జరుగుతోందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.హైమావతి తెలిపారు. ఇవాళ‌ ఆమె రాయపోల్ మండలంలోని మంతూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అనాజిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ.. మధ్యాహ్నం 1 గంట వరకు క్యూ లైన్‌లో ఉన్న వారికే మాత్రమే ఓటు వేసే అవకాశం ఇవ్వాలన్నారు. ఆ తరువాత కొత్తగా వచ్చే ఓటర్లను అనుమతించరాదన్నారు. ఓటింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్స్‌లకు లాక్ వేసి సీల్ చేయాలని, లంచ్ అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రాసెస్ మొదలైంద‌ని, కౌంటింగ్ సెంటర్లలో ఏజెంట్లు గానీ, పోలింగ్ సిబ్బంది గానీ మొబైల్ ఫోన్లు ఉపయోగించే వీలు లేదన్నారు.

Leave a Reply