Polling | మహబూబ్‌నగర్‌లో మున్సిపల్ ఎన్నికల హోరు…

Polling | మహబూబ్‌నగర్‌లో మున్సిపల్ ఎన్నికల హోరు…
- 60 డివిజన్లలో కట్టుదిట్టమైన భద్రత
- 144 సెక్షన్ అమలు
- భారీగా ఓటర్ల పోలింగ్
Polling | మహబూబ్ నగర్, ఆంధ్రప్రభ : మహబూబ్‌నగర్ జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. జిల్లా కేంద్రంలోని మొత్తం 60 డివిజన్లలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగుతున్నప్పటికీ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ జానకి ఆధ్వర్యంలో నగరంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తూ శాంతిభద్రతలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
100 మీటర్ల పరిధిలో ఐదుగురికిపైగా గుమికూడరాదని, 200 మీటర్ల పరిధిలో ఎన్నికల ప్రచారం నిషేధమని అధికారులు స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద సెల్ఫోన్లు, వాటర్ బాటిళ్లు, ఇనుప బాటిళ్లు, ఆయుధాలు, ఇతర అనుమానాస్పద వస్తువులకు అనుమతి లేదని హెచ్చరించారు. రూట్ మార్చ్‌లు నిర్వహిస్తూ ప్రజల్లో భద్రతాభావాన్ని కల్పించారు.మహబూబ్ నగర్ 21వ డివిజన్లో లోకల్ నాన్-లోకల్ అంశంపై స్వల్ప ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ, పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఇద్దరు భాజపా నేతలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

కాగా.. పురపాలక పరిధిలోని 46వ వార్డులో మహిళా మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ప్రత్యేకంగా అలంకరించి ఏర్పాటు చేశారు. మొత్తం 3095 మంది ఓటర్లు ఉన్న ఈ కేంద్రంలో ఉదయం 9:30 గంటల వరకు సుమారు 27 శాతం పోలింగ్ నమోదైంది. భారీసంఖ్యలో మహిళా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం.ఇక మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివస్తున్నారు. ఎంబీఎన్ఆర్ కార్పొరేషన్ పరిధిలో 1,97,841 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇ
ప్పటివరకు మున్సిపాలిటీలో 10,070 మంది, భూత్పూర్ మున్సిపాలిటీలో 12,064 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం మీద మహబూబ్‌నగర్‌లో మున్సిపల్ ఎన్నికలు ఉత్కంఠభరిత వాతావరణంలో కొనసాగుతుండగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్య పండుగగా ఎన్నికలను విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు.
