Politics | వినూత్న ప్రచారంలో ముందడుగు
Politics | ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : మండల పరిధి రామానుజగూడెం గ్రామపంచాయతీ సీపీఐ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గొగ్గల బుచ్చయ్యదొర అన్ని పార్టీల కంటే భిన్నంగా వినూత్నప్రచారంలో ముందంజలో ఉన్నారు. ఎన్నికల్లో తనకు వచ్చిన ఉంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓటేయాలని రాయిలంక, వలసల్ల, తునికిబండల, రామంజిగూడెం పలు గ్రామాల్లోని అహర్నిశలుగా అర్ధరాత్రిలో చలిని సైతం లెక్కచేయక గెలుపే లక్ష్యంగా ముందడుగుతో ఓటర్లను అభ్యర్థించారు.
సర్పంచ్ అభ్యర్థి(candidate) బుచ్చయ్య దొర వరుసకు దాద గోగ్గల వెంకయ్యదొర, తనతండ్రి గోగ్గల రామయ్యదొరలు తునికిబండల గ్రామంలోనీ ఎన్నో ఏండ్లుగా గ్రామ పెద్దదొరలుగా కొనసాగుతూ, ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా మెలుగుతూ, నీతి నిజాయితీకి నిలువెత్తురూపం మంచిమనసు, మంచి వ్యక్తిత్వం కలిగిన గ్రామపెద్దగా ప్రజలందరి మన్ననలు పొందిన వ్యక్తి సీపీఐ సర్పంచ్ అభ్యర్థిగా మీముందుకు వస్తున్నానని గ్రామ అభివృద్ధికి తన వంతు అహర్నిశలుగా కృషి చేస్తానని పేర్కొన్నారు.
రాజకీయాలం(politics)టే వ్యాపారంగా మారిన ఈరోజుల్లో తాతలనాటి నుంచి దొర, గ్రామపెద్దలుగా చేసిన మంచి పనులు అభివృద్ధి అనుభవం ఉన్నవ్యక్తి, త్యాగశీలి, మంచికి మారుపేరు, నిరాడంబరతగా జీవిస్తూ, చిరునవ్వులతో అభిమానులను పలకరించే మనస్తత్వం కలిగిన గొగ్గల బుచ్చయ్య సీపీఐ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఆదరించి ఆశీర్వదించాలని ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, భద్రాద్రి జిల్లా సీపీఐ పార్టీ కార్యదర్శి షేక్ సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు, మాజీ వైస్ ఎంపీపీ రేసు ఎల్లయ్య,మాజీ సర్పంచ్ గోగ్గల కృష్ణయ్యకు కానుకగా సర్పంచి గెలుపును ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

