Poling | భీంగల్ లో 69.78 శాతం పోలింగ్

Poling | భీంగల్ లో 69.78 శాతం పోలింగ్
Poling | భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ; మున్సిపల్ సాధారణ రెండో విడుత ఎన్నికల్లో బుధవారం జరిగిన ఎన్నికల్లో 69.78 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మొత్తం ఓటర్లు 14045 మంది ఉండగా అందులో 9800 మంది ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. 9800 ఓటర్లలో 4148 మంది పురుషులు, 5652 మంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్ ముగిసిన తరువాత బ్యాలెట్ బాక్స్ లను బందోబస్త్ మధ్య జూనియర్ కళాశాల లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూం కి తరలించారు. రేపు నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యే వరకు పోలీస్ భద్రత నడుమ బ్యాలెట్ బాక్స్ లను భద్రపరుస్తారు.
